రాజ్యసభకు నిన్నటి తరం బాలీవుడ్ హీరోయిన్ రేఖ

రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి పన్నెండు మందిని ఎగువ సభ రాజ్యసభకు ఎంపిక చేస్తారు. రాజ్యసభకు నామినేట్ చేయనున్న పేర్లను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్‌కు బుధవారం పంపించారు. ఇది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు పంపిస్తారు. ఆమె వాటిని పరిశీలించి ప్రకటిస్తారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం సాహిత్యం, శాస్త్రీయం, కళ, సామాజిక సేవ తదితర రంగాలలోని ప్రముఖులను ఎంపిక చేసే అవకాశం ఉంది. రేఖ వయస్సు యాభై ఏడేళ్లు. ఈమె తన నటనకుగాను తన కేరీర్‌లో ఎన్నో జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ప్రముఖ హిందీ రచయిత, స్ర్కిప్ట్ రైటర్ జావెద్ అక్తర్ ఇప్పటికే రాజ్యసభలో ఉన్నారు.
కాగా మాస్ట్రర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరును కూడా రాజ్యసభకు ప్రభుత్వం సిఫార్సు చేసింది. సచిన్ పేరును ప్రతిపాదించాలని హోంమంత్రిత్వ శాఖకు ప్రధాని లేఖ రాశారు. రేఖ, సచిన్ టెండుల్కర్‌ల పేర్లను సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ప్రముఖ వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు.












Click it and Unblock the Notifications