చంద్రబాబుకు సమాధానం చెప్తా: వల్లభనేని వంశీ

జగన్ రెండోసారి పలకరించడంతో సంస్కారం కాదన్న ఉద్దేశంతోనే నమస్కారం చేశానని చెప్పారు. ఇంత వివాదం అవుతుందనుకోలేదన్నారు. జరిగిన విషయాన్ని అధినేతకే చెబుతానని, పరిటాల హత్య వెనుక జగన్ హస్తం ఉందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సమర్థించటానికి నా దగ్గర ఆధారాలూ లేవని చెప్పారు. జగన్, వంగవీటి రాధా వాహనం దిగి రావడంతో తాను కూడా ఎదురు వెళ్లానని చెప్పారు.
జగన్‌ను ఆలింగనం చేసుకోలేదన్నారు. తనకు ఇంకా నోటీసు అందలేదని, మూడు నాలుగు రోజుల్లో ఆయనను కలిసి ఇచ్చే వివరణను మీడియాకూ ఇస్తానని చెప్పారు. వంగవీటి రాధాను గతంలో టిడిపిలోకి తీసుకురావాలని ప్రయత్నించానని చెప్పారు. మాజీ మంత్రి పరిటాల రవి అనుచరుడిని అయినందుకు గర్విస్తున్నానని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
తన కుమారుడికి సునీతమ్మ రవి పేరు పెట్టారని, ఎవరైనా బిడ్డలతో రాజకీయాలు చేస్తారా అన్నారు. జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వర రావుతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. వంగవీటి రాధ కూడా తనకు మంచి మిత్రుడన్నారు. సమాచార లోపం వల్లనే షోకాజ్ నోటీసు ఇచ్చారని చెప్పారు. జగన్‌పై సిద్ధాంతపరంగానే తప్ప భౌతికంగా పోరాడడం లేదు కాబట్టే పలకరించాల్సి వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications