గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈనాడు యాడ్స్‌పై అంబటి ప్రశ్న!, బాబుకు నిద్ర పట్టదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
గుంటూరు/విశాఖపట్నం: రామోజీ రావుకు చెందిన మార్గదర్శి విషయంలో అప్పట్లో ఈనాడుకు యాడ్స్ ఇవ్వకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు కోర్టులపై నమ్మకముందని, అంతి విజయం తమదే అవుతుందని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజాయుద్ధంలో ఓటమే శరణ్యం అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు దావూద్ ఇబ్రహీం, భాను కిరణ్‌లతో పోల్చడంపై ఆయన మండిపడ్డారు. వారితో పోల్చాల్సింది చంద్రబాబునే అన్నారు. జగన్ పేరు వింటే చంద్రబాబుకు నిద్ర పట్టదన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతిపక్షాలతో కలిసి సాక్షి గొంతు కోయాలని చూస్తున్నాయని విమర్శించారు. ఏప్రిల్ 30వ తేదిననే సాక్షికి ప్రకటనలు నిలుపుదల చేయాలని జివో తయారు చేశారన్నారు. సిబిఐ ప్రభుత్వం కూడబలుక్కొని జగన్ పైన కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.

కేంద్రం, ప్రతిపక్షాలు కుట్ర పన్ని సాక్షి బ్యాంకు ఖాతాలను స్తంభింప జేశాయన్నారు. సాక్షి పత్రికకు ప్రకటనలు నిలుపుదల చేయడం మరో కుట్ర అన్నారు. రామోజీ రావు, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి సిండికేట్‌గా ఏర్పడి కుట్ర చేస్తున్నారన్నారు. తమకు ప్రజాబలం, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు ఉన్నంత వరకు విజయం సాధిస్తామని అన్నారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu questioned about Eenadu advertisement at the time of Margadarshi case. He lashes out at TDP chief Nara Chandrababu Naidu and chief minister Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X