సాక్షి గానీ లేకపోతే...: ఈనాడు, జ్యోతిపై జగన్ నిప్పులు

సాక్షి గాని లేకపోతే ఈనాడు రాసిందే రాత, ఆంధ్రజ్యోతి గీసిందే గీత టివి9 చూపించిందే నిజం అన్నారు. ప్రజలను నమ్మించొచ్చని వీరంతా ఒక్కటై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెసు, టిడిపి రెండు పార్టీలే ఉండాలట అన్నారు. బాబు, కాంగ్రెసు సిగ్గుమాలిన, నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేవుడనే వాడు ఉన్నాడని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే ప్రతి ఒక్కరూ ఏకమవుతారన్నారు.
వైయస్ మరణించాక ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. బాబు కనీవినీ ఎరుగని రీతిలో అధికారపక్షంతో కుమ్మక్కయ్యారన్నారు. ఆర్టీఐ కమిషనర్ల పదవులను ఇద్దరు కలిసి పంచుకున్నారన్నారు. కాంగ్రెసు, టిడిపి కలిసిపోయిందనడానికి మంచి ఉదాహరణ సిబిఐ దర్యాఫ్తే అన్నారు. వైయస్ రాష్ట్రంలో ఎంతో చేస్తే అది తమ పని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంటోందన్నారు.
రాష్ట్రంలో ఎన్నడూ లేని ఒక వింత మిత్రుత్వం కనిపిస్తోందన్నారు. అధికార పక్షం తప్పు చేస్తే నిలదీయాల్సిన ప్రతిపక్షం కాంగ్రెసుతో కుమ్మక్కైందన్నారు. రానున్న ఎన్నికలలో రెండు పార్టీలు కొట్టుకు పోవడం ఖాయమన్నారు. ప్రజలు, రైతుల పక్షాన నిలబడిన పదిహేడు మంది తాజా మాజీ ఎమ్మెల్యేలకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications