యడ్డీకి సుప్రీం షాక్: సిబిఐ విచారణకు ఆదేశం

BS Yeddyurappa
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు శుక్రవారం సిబిఐ విచారణకు ఆదేశించింది. మైనింగ్ కుంభకోణంలో యడ్యూరప్ప పాత్రపై జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ సిబిఐ విచారణకు ఆదేశించింది.

మైనింగ్ సంస్థల నుంచి యడ్యూరప్ప కుటుంబ సభ్యులు భూముల డీనోటిఫికేషన్ విషయంలో లంచాలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఇంతకు ముందు సాధికారిక కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు యడ్యూరప్పపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ముడి ఇనుము అక్రమ ఎగుమతిలో, కొంత మంది పోలీసు అధికారుల బదిలీలో, తు కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చిన భూవ్యవహారాల్లో యడ్యూరప్ప పాత్ర ఉందని సాధికారిక కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపింది.

యడ్యూరప్పపై వచ్చిన ఆరోపణలు మీద సిబిఐ దర్యాప్తు అవసరమని సాధికారిక కమిటీ అభిప్రాయపడింది. బెంగళూర్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల డీనోటిఫికేషన్‌పై సిబిఐ దర్యాప్తు చేయవచ్చునని కమిటీ సూచించింది. జిందాల్ స్టీల్‌ అనుబంధ సంస్థ సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీకి మైనిండ్ డీల్‌లో ప్రయోజనం చేకూర్చారని వచ్చిన ఆరోపణపై దర్యాప్తు అవసరమని కూడా చెప్పింది. యడ్యూరప్ప కుటుంబ సభ్యులు నడుపుతున్న ప్రేరణ ఎడ్యుకేషన్ సొసైటీకి భారీ విరాళాలు ఇవ్వడానికి, భూముల డీనోటిఫికేషన్‌కు మధ్య సంబంధం ఉందనే ఆరోపణలు వచ్చాయి.

యడ్యూరప్పపై వచ్చిన ఆరోపణలతో, వాటిని లోకాయుక్త ఎత్తి చూపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని బిజెపి అధిష్టానం ఆదేశించింది. దాంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+