జగన్‌ను వెంటాడుతున్న సిబిఐ! సమన్లు ఇచ్చేందుకే

ఎమ్మిగనూరు నందవరం మండలంలో జగన్ ఉన్నారు. సిబిఐ బృందం మరికొద్దిసేపట్లో అక్కడకు చేరుకొని, ఆయనను ప్రత్యేకంగా కలిసి సమన్లు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అయితే సిబిఐ బృందం కేవలం సమన్లు జారీ చేసేందుకే కర్నూలు వచ్చిందా మరే కారణమైనా ఉందా అను అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సిబిఐ జగన్‌కు సమన్లు ఇవ్వాలనుకుంటే హైదరాబాదులోని లోటస్ పాండులోని అతని ఇంట్లో అందజేసే అవకాశముంది. అలాంటప్పుడు కర్నూలు వెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. దీంతో ప్రత్యేకంగా జగన్‌కు వ్యక్తిగతంగా సమన్లు ఇవ్వడానికే వెళ్లారా లేక మరే కారణమైనా ఉందా అనే కోణంలో చర్చ జరుగుతోంది. సిబిఐ అధికారులు నిన్న రాత్రే కర్నూలు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
సమన్లు అందించడానికి సిబిఐ వస్తున్న విషయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు శనివారమే తెలిసిందని సమాచారం. అందుకే ఆ పార్టీ నేతలు.. సిబిఐ సమన్లు ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాగా ఇటీవల సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి తదితరులకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆస్తుల కేసు విషయంలో ఈ నెల 28వ తేదిన కోర్టుకు రావాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications