భార్య గొంతు కోసి, భయంతో ఉరేసుకున్న భర్త

తీవ్ర గాయాలు అయిన ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే భార్య చనిపోతుందన్న భయంతో భర్త ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య పరిస్థితి విషమంగా ఉంది. భర్త చనిపోవడం, భార్య ఆసుపత్రిలో ఉండటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవులో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెడ్డిగూడెంకు చెందిన ఎనిమిది మంది ముస్లింలు చీరాల ఓడ రేవు వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చారు. ఇందులో షేక్ సుబానీ, షేక్ బాజీ సముద్ర స్నానానికి వెళ్లారు. ఆ తర్వాత వారు కనిపించక పోవడంతో స్థానికలతో కలిసి కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు.
నల్గొండ జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి మామిడికాయల లోడుతో గుజరాత్ వెళ్తున్న లారీని కనకదుర్గ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తోపాటు బస్సు డ్రైవర్, మరో ప్రయాణీకుడు మృతి చెందాడు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్ మృతదేహాన్ని మూడు గంటల పాటు శ్రమించి క్రేన్ సహాయంతో బయటకు తీశారు. గాయాలపాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications