జగన్, చంద్రబాబులపై నిప్పులు చెరిగిన బొత్స సత్తిబాబు

Botsa Satyanarayana
హైదరాబాద్: ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీలు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తోందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలను రద్దు చేసిన వ్యక్తే ఇప్పుడు మళ్లీ వాటిని అమలు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ఎలా సాధ్యమో చంద్రబాబే చెప్పాలన్నారు.

గతంలో కిలో బియ్యం ధరను చంద్రబాబు రూ.2 నుంచి రూ.5కు పెంచిన విషయాన్ని బొత్స గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన ఇస్తున్న ఉచిత బియ్యం హామీలను ప్రజలు నమ్మరన్నారు. ఎమ్మార్‌లో కుటుంబ సభ్యులకు విల్లాలు ఎలా వచ్చాయో చంద్రబాబు జవాబు చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.

తనపై వచ్చిన ఆరోపణలపై బాబు విచారణకు సిద్ధపడకుండా బెయిల్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలలో టిడిపికి మూడో స్థానమే అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధన బలంతో ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

జగన్ తన పార్టీ జెండాలో పెట్టుకున్న గుర్తులు అన్నీ కాంగ్రెసు పార్టీ పథకాలే అన్నారు. వైయస్సార్ అంటే పూర్తి పేరు చెప్పలేని స్థితిలో ఆ పార్టీ ఉందన్నారు. ఉప ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పారు. కాగా బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సిఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+