బాబుకు షాక్: కాంగ్రెసులోకి కందాటి శంకర రెడ్డి

గత మూడేళ్ళుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. తిరుపతికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో శంకర్‌రెడ్డి మద్దతు కోసం తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. తెలుగుదేశం పార్టీ తరపున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ తదితరులు శంకర్‌రెడ్డిని మళ్లీ పార్టీలోకి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నించారు. అదే సమయంలో కాంగ్రెస్ వైపునుంచీ ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి శంకర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు.
వాస్తవానికి కాంగ్రెస్‌లో చేరడానికి అప్పట్లోనే శంకర్‌రెడ్డి మానసికంగా సిద్దపడినా తన అనుచరుల అభిప్రాయాలు తెలుసుకోవడం పేరుతో ఏ నిర్ణయం ప్రకటించకుండా ఉండిపోయారు. వారి అభిప్రాయం తెలుసుకోవడం కోసం 'వార్డు బాట' చేప ట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సోదరుడు కిషోర్ కుమార్‌రెడ్డి, పార్లమెంటు సభ్యుడు చింతామోహన్, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శంకర్‌రెడ్డితో జరిపిన చర్చలు ఫలించాయి. కాంగ్రెస్‌లో చేరడానికే ఆయన నిర్ణయించుకున్నారు. బుధవారం ఉదయం మాజీ కౌన్సిలర్లు, అనుచరులతో కలసి సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి రాజీనామా చేయడం వల్ల తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు. కాంగ్రెసు నుంచి వెంకటరమణ పోటీలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి పోటీకి దిగారు. అయితే, శంకర రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అండగా ఉండేందుకే తాను కాంగ్రెసులో చేరుతున్నట్లు శంకర రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications