జగన్ వద్ద రౌడీలు: మంత్రి ఏరాసు సంచలన వ్యాఖ్యలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొట్టే పార్టీ అని, తెలుగుదేశం తిట్టే పార్టీ అని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ గుంటూరు జిల్లాలో అన్నారు. ప్రజాహిత యాత్ర ఆస్కార్ ఫెర్నాండేజ్ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. వైయస్ జగన్ కాంగ్రెసు పథకాలను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు వైయస్ పార్టీ కాదని, జగన్ పార్టీ అన్నారు.
వైయస్ ఏనాడూ సొంత పార్టీపై విమర్శలు చేయలేదన్నారు. పార్టీని, పార్టీ నేతలను ఎప్పుడూ గౌరవించేవారన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని 2014లో ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా ఆయన పని చేశారన్నారు. వైయస్ ఎప్పుడూ కాంగ్రెసు నాయకుడే అన్నారు. వైయస్, జగన్‌ల మధ్య కేవలం తండ్రి కోడుకుల అనుబంధమేనని, రాజకీయ సంబంధం లేదన్నారు.
రాజకీయ స్వార్థంతో ముఖ్యమంత్రి పదవి కోసమే జగన్ దివంగత వైయస్ పేరును ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదన్నారు. ప్రజాహిత కార్యక్రమంలో లగడపాటి రాజగోపాల్, కెవిపి రామచంద్ర రావు, జెడి శీలం, సర్వే సత్యనారాయణ, నంది ఎల్లయ్య, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొంటారని చెప్పారు.
ముఖ్యమంత్రిని అవుతానని, అరెస్టవుతానని రెండు రకాలుగా జగనే చెప్పుకుంటున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కృష్ణా జిల్లాలో అన్నారు. జగన్ జైలు పాలవ్వక తప్పదన్నారు. చేసిన తప్పులకు పాపపరిహారం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. జగన్‌వి అతి తెలివి మాటలను మంత్రి ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. హింసను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications