మోపిదేవి అరెస్టు: మంత్రులతో సిఎం సమాలోచన

మంత్రులతో ముఖ్యమంత్రి ప్రధానంగా రెడ్డి విషయాలు మాట్లాడారు. మోపిదేవి అరెస్టు నేపథ్యంలో తాము అనుసరించాల్సిన వ్యూహం ఏమిటనేది మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. మరో ఐదుగురు మంత్రులు కూడా మోపిదేవి పరిస్థితినే ఎదుర్కోవచ్చుననే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏం చేయాలనే విషయంపై సమావేశంలో మాట్లాడారు. మరోవైపు, రేపు శుక్రవారం వైయస్ జగన్ సిబిఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా సమావేశంలో మాట్లాడారు.
కాగా, మోపిదేవికి కొంత మంది మంత్రులు మద్దతు ప్రకటిస్తున్నారు. మోపిదేవికి మద్దతుగా నిలవాలని మంత్రి శైలజానాథ్ అన్నారు. మోపిదేవి అరెస్టు బాధాకరమని ఆయన అన్నారు. బిసి మంత్రిని అరెస్టు చేయడం దారుణమని మరో మంత్రి పార్థసారథి అన్నారు. ఎవరో ప్రయోజం పొందితే మోపిదేవిని అరెస్టు చేయడమేమిటని ఆయన అడిగారు. మోపిదేవి అరెస్టు బాధాకరమని ఆయన అన్నారు.
మోపిదేవికి మంచి పేరుందని, మోపిదేవి అరెస్టు బాధాకరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెసు అవసరాల కోసమే మోపిదేవిని సిబిఐ అరెస్టు చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు వ్యాఖ్యానించారు. మోపిదేవిని అరెస్టు చేసి మిగతావారిని వదిలేస్తే సిబిఐని శంకించాల్సి వస్తుందని ఆయన అన్నారు.
మోపిదేవి అరెస్టు ఓ రాజకీయ కుట్ర అని ఉదయగిరి శాసనసభా స్థానం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి అన్నారు. జగన్‌ను తక్కువ చేసి చూపేందుకు కాంగ్రెసు అధిష్టానం అరెస్టుల కుట్రకు తెర లేపిందని ఆయన అన్నారు. రాజకీయ చరిత్రలో ఓ కొత్త తరహా కార్యాచరణను కాంగ్రెసు రచించిందని ఆయన అన్నారు.
మంత్రి మోపిదేవి అరెస్ట్ పై ఎఐసీసీ పరిశీలకుడు కే.బి కృష్ణ మూర్తి స్పందిస్తూ చట్టం తనపని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు బొత్స మాట్లాడుతూ మోపిదేవి అరెస్ట్ బాధాకరమని, పూర్తి సమాచారం తెలుసుకున్నాక ఈ వ్యవహారంపై స్పందిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications