బిజెపి కార్యవర్గం నుంచి సంజయ్ జోషీ రాజీనామా

 BJP Logo
న్యూఢిల్లీ: పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి బిజెపి నేత సంజయ్ జోషీ రాజీనామా చేశారు. ఈ మేరకు టెలివిజన్ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. పార్టీలో విభజన ఉండకూడదని జోషి బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో అన్నట్లు సమాచారం. జోషీ రాజీనామా నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరు కావచ్చునని భావిస్తున్నారు.

పార్టీలోని నిర్ణయాత్మక విభాగం జాతీయ కార్యవర్గంలో తన ప్రత్యర్థి సంజయ్ జోషీకి స్థానం కల్పించడం పట్ల నరేంద్ర మోడీ నితిన్ గడ్కరీపై అసంతృప్తితో ఉన్నారు. దాంతో ముంబైలో జరుగుతున్న జాతీయ కార్యవర్గానికి తాను హాజరు కాబోనని కూడా నరేంద్ర మోడీ సంకేతాలు ఇచ్చారు.

మే 24వ తేదీన మోడీ ఉదయపూర్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నారని గుజరాత్ ప్రభుత్వం బుధవారం తెలిపింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మహారాణ ప్రతాప్ జయంతి వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోడీ హాజరవుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది.

సంజయ్‌ జోషీని నితిన్ గడ్కరీ పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తిరిగి తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మోడీ ఢిల్లీలో జరిగిన సమావేశానికి నరేంద్ర మోడీ హాజరు కాలేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మోడీ ప్రచారం కూడా చేయలేదు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు గురు, శుక్రవారాల్లో ముంబైలో జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+