కోల్‌కతా జట్టును దాటిన 'జగన్': ఇంటర్నెట్‌లో హల్‌చల్

అదే రోజు రాత్రి జగన్ అరెస్టు జరిగింది. దీంతో సోమవారం జగన్ అరెస్టు వార్తలు ఇంటర్‌నెట్‌లో ఐపిఎల్‌ను మించిపోయాయి. గూగుల్ న్యూస్‌లో జగన్ అరెస్టుపై 30 సెకండ్లలోనే 72,800 వార్తా కథనాలు ప్రత్యక్షం కాగా, కోల్‌కతా జట్టుపై 38 సెకండ్లలో 37,700 కథనాలు మాత్రమే కనిపించాయి.
ఇంటర్నెట్‌లో కేవలం జగన్ అనే పదాన్ని మాత్రమే సెర్చ్ చేస్తే 36 సెకండ్లలో ఏకంగా 1.10 కోట్లకు పైగా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. జగన్ అరెస్టుపై ఇంటర్నెట్‌లో దాదాపు పదిహేడు లక్షల కథనాలు కనిపిస్తుండగా, జగన్మోహన్ రెడ్డి పేరుతో వెదికితే గూగుల్‌లో పదమూడు లక్షల కథనాలకు పైగా కనిపిస్తున్నాయి.
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదివారం సాయంత్రం సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జగన్ అరెస్టు కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద న్యూస్ అయింది. అన్ని వెబ్‌సైట్లు, వార్తా పత్రికలు దానిని ప్రధానంగా ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా జగన్ ఆస్తుల కేసుపై దర్యాఫ్తు విదేశీ మీడియా కూడా దృష్టి సారించిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications