రోజా బాబు బూట్ల శుభ్రానికీ పనికి రాదు: కవిత

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ముందు మంచి తల్లిగా ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. కొడుకు వైయస్ జగన్ అవినీతి పనులు చేస్తున్నా పట్టించుకోని విజయమ్మ ఇప్పుడు తన కొడుకును జైల్లో పెట్టారని గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని కవిత అన్నారు. విజయమ్మ ప్రచారానికి వచ్చినంత మాత్రాన ప్రజలు జరిగిన అవినీతిని మరిచిపోరని ఆమె అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విషయంలో రాజకీయ కుట్ర లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. జగన్ స్వయంకృతాపరాధమేనని ఆయన అన్నారు. పెట్రోలు ధర పెంపును నిరసిస్తూ కడపలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్‌పై ఆయన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా మొదట తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు.












Click it and Unblock the Notifications