కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ అభ్యర్థికి చుక్కెదురు, గాల్లోకి గన్‌మెన్ కాల్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kadapa Map
కడప: జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పాత రాయచోటిలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు రాళ్లు కూడా రువ్వుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాయచోటి నియోజకవర్గం అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం పాత రాయచోటి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉంది.

అక్కడ శ్రీకాంత్ రెడ్డికి స్థానికుల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుండి చుక్కెదురయింది. ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదిరి ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో శ్రీకాంత్ రెడ్డి గన్‌మెన్ గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ బాలుడికి కొద్దిగా గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.

అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. కాగా ఉద్దేశ్య పూర్వకంగానే తమ ప్రాంతంలోకి ప్రచారం పేరున వచ్చి తమను రెచ్చగొట్టే ప్రయత్నాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.

కాగా అనంతపురం జిల్లా కొడికొండ చెక్ పోస్టు వద్ద సోమవారం ఉదయం పోలీసులు రూ.కోటిని స్వాధీనం చేసుకున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలలో భాగంగా ఈ నగదును పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ డబ్బు బెంగళూరు నుండి వచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
YSR Congress party Rayachoti candidate Srikanth Reddy's gunmen fired in to air at Old Rayachoti. YSR Congress and Telugudesam party activists thrown stones at each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X