హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరకట్నం వేధింపులపై టెక్కీ, అతని తల్లి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: వరకట్నం వేధింపుల కేసులో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, అతని తల్లిని హైదరాబాదులోని మల్కాజిగిరి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. దీప్తిశ్రీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను వరకట్నం వేధింపులకు గురి చేశారనే ఆరోపణపై పోలీసులు కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్ వి. ప్రదీప్ నాగ్‌ను, ఆయన తల్లి మేరీ విక్టోరియాను అరెస్టు చేశారు.

దీప్తిని ప్రదీప్ నాగ్ 2009లో వివాహం చేసుకున్నాడు. పెళ్లి సందర్భంగా తన కుటుంబం వరకట్నం కింద పది లక్షల రూపాయలు ఇచ్చిందని, అదనపు కట్నం కోసం ప్రదీప్, అతని కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని, 2012 మే వరకు తాము అదనంగా పది లక్షల రూపాయలు ఇచ్చామని దీప్తిశ్రీ తన ఫిర్యాదు తెలిపింది.

ఆ మొత్తం ఇచ్చిన తర్వాత కూడా మరిన్ని డబ్బుల కోసం తనను ప్రదీప్ కుటుంబ సభ్యులు వేధించసాగారని ఆమె తెలిపింది. చివరకు ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రదీప్‌పై, ఆయన తల్లిదండ్రులపై పోలీసులు కేను నమోదు చేశారు. ప్రదీప్‌ను, మేరీ విక్టోరియాను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.

English summary
A software employee and his mother were arrested by the Malkajgiri police in a dowry harassment case on Saturday. Police arrested Cognizant software consultant V Pradeep Nag, 26, and his mother Mary Victoria for allegedly harassing Deepthi Sri, a software engineer from Maruthi Nagar in Malkajgiri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X