హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇబ్బంది పెట్టారా అని అడిగిన జడ్జి: లేదన్న జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: సిబిఐ కస్టడీలో ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను అడిగారు. అలాంటిదేమీ లేదని వైయస్ జగన్ సమాధానమిచ్చారు. గురువారంతో సిబిఐ కస్టడీ ముగిసిపోవడంతో వైయస్ జగన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నెల 11వ తేదీన ఆయనను కోర్టులో హాజరు పరచాలని న్యాయమూర్తి జైలు అధికారులను ఆదేశించారు.

ఐదు రోజుల పాటు సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. గురువారం సాయంత్రం జగన్ సిబిఐ కస్టడీ ముగిసింది. గురువారం సాయంత్రం సమయం మించిపోవడంతో ఆయనను కోర్టులో హాజరు పరచలేకపోయారు. శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఆయనను విచారించింది.

వైయస్ జగన్‌కు చెందిన సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహంపై సిబిఐ దృష్టి పెట్టింది. జగతి పబ్లికేషన్స్ (సాక్షి పత్రిక), ఇందిరా టెలివిజన్ (సాక్షి టీవీ), జననీ ఇన్‌ఫ్రా సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చిన తీరుపై సిబిఐ అధికారులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. వైయస్ జగన్ తమ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదని సిబిఐ అధికారులు భావించారు.

దాంతో మరో మూడు రోజుల పాటు జగన్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ గురువారం లంచ్ మోషన్‌గా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా దానిపై విచారణను చేపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

English summary
Court has taken up hearing of YSR Congress president YS Jagan through video conference. Judge has asked YS Jagan he has faced any problem in CBI custody. Jagan answered negatively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X