• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జైల్లో ఉన్నా సింహం సింహమే: షర్మిల, చిరంజీవిపై రోజా

By Srinivas
|

Roja-Sharmila
కడప: తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సెప్టెంబర్ 2న హెలికాప్టర్‌లో చిత్తూరు జిల్లాకు పయనమైనప్పుడు, ఆయనతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన సొంత జిల్లా చిత్తూరుకు వెళ్లాల్సి ఉందని, కానీ ఆయన వెళ్లలేదని, ఎందుకు వెళ్లలేదో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం ప్రశ్నించారు.

ఆమె తన తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయలక్ష్మితో కలిసి కడప జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. తన తండ్రి తెచ్చిన అధికారాన్ని వాడుకొని కాంగ్రెసు పెద్దలు ఆయన కుటుంబాన్నే వేధిస్తున్నారని ఆరోపించారు. సిబిఐ విచారణ పేరుతో తన సోదరుడు జగన్‌ను జైలుపాలు చేశారని మండిపడ్డారు. సింహం బోనులో ఉన్నా సింహమే అని వారు గుర్తెరిగేలా ఉప ఎన్నికలల్లో తీర్పు ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు.

నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సిబిఐ సంస్థ.. జగన్ కేసులో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరో జు తన తండ్రి ప్రయాణించిన హెలికాప్టర్‌లో తెలిసే వెళ్లలేదా లేదా తెలియక వెళ్లలేదా చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలు, రైతుల కోసం రాజీనామా చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పాలని సూచించారు.

రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఆ పార్టీ నేత రోజా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఉప ఎన్నికల ప్రచారంలో అన్నారు. చిరంజీవి రాజకీయ అజ్ఞాని అని మండిపడ్డారు. చిరంజీవి చాల ఎక్కువగా మాట్లాడుతున్నారని, సంక్షేమ పథకాలన్ని అమలవుతున్నాయని చెబుతున్న ఆయనకు అపర సంజీవినిలాంటి ఆరోగ్యశ్రీ నుంచి కొన్నిరోగాలను తొలగించిన విషయం తెలియదా అని ప్రశ్నించారు.

108 వాహనాలు డీజిల్ లేక షెడ్లలోనే ఉన్న విషయం ఆయన తెలుసుకోవాలని సూచించారు. జగన్‌కు అధికారదాహం, స్వార్థం అంటున్న చిరంజీవిదే స్వార్థమని అన్నారు. అందుకే సామాజిక న్యాయం పేరిట స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని హోల్ సేల్‌గా కాంగ్రెసు పార్టీకి అమ్మేసుకున్నారన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy's sister Sharmila said on thursday in his Kadapa bypolls tour that a lion is lion even in jail. She referring her brother YS Jaganmohan Reddy. Party leader Roja lashed out at Rajyasabha Member Chiranjeevi in Narsapuram of west godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more