వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్పులుచేస్తాం: కిరణ్, వారికి ఓటేస్తే కన్నీళ్లు..చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Chiranjeevi
రాజమండ్రి/శ్రీకాకుళం: ఉప ఎన్నికలలో ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతోనే గెలుస్తారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాజమండ్రిలో అన్నారు. ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాదు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు మధ్యే పోటీ అన్నారు. తెలుగుదేశం పార్టీకి మూడో స్థానమే అని చెప్పారు. 2014 ఎన్నికల వరకు కాంగ్రెసు పార్టీ ఉంటుందని చెప్పారు.

సంక్షేమ పథకాలు, అభివృద్ధియే తమను గెలిపిస్తుందని కిరణ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు పదే పదే రాజీనామా చేయకుండా త్వరలో ఓ చట్టం తేనున్నట్లు కిరణ్ చెప్పారు. చట్టంలో అందుకు అనుకూలంగా మార్పులు చేస్తామని చెప్పారు. క్విడ్ ప్రో కో ఉదంతంలో మంత్రులపై ఆరోపణలు రుజువు కాలేదని చెప్పారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు పరిష్కారాలు ఆలోచిస్తున్నామని చెప్పారు.

ఉప ఎన్నికలు అవినీతికి, నీతికి మధ్య జరుగుతున్న పోరు అని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పాయకరావుపేటలో అన్నారు. ఆయన పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో కలిపి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి కోటలు బీటలు వారేలు ఓటర్లు తీర్పు ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే కష్టాలు, కన్నీళ్లే మిగులుతాయన్నారు.

వైయస్ జగన్‌కు ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లే అన్నారు. వైయస్ జగన్ పార్టీకి ఓటు వేయవద్దని పిసిసి చీఫ్ బొత్స అన్నారు. కొడుకుకు రాజ్యాధికారం కట్టబెట్టడం కోసం పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. జగన్ అవినీతిని సమర్థించవద్దని కేంద్రమంత్రి పురంధేశ్వరి శ్రీకాకుళం జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో అన్నారు. కాంగ్రెసు పార్టీ అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. జగన్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో అరాచక పాలన వస్తుందన్నారు.

దళితులు అంతా కాంగ్రెసు వైపే ఉన్నారని అనంతపురంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసుదే గెలుపు అన్నారు. వైయస్ జగన్ అవినీతిపరుడని సిబిఐ, కోర్టులే చెబుతున్నాయన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లినంత మాత్రాన సానుభూతి రాదన్నారు.

English summary
Rajyasabha Member Chiranjeevi said that this is big mistake if we vote to Telugudesam Party or YSR Congress Party. Chief minister Kiran Kumar Reddy said TDP will get third place in upcoming bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X