దారుణం: కత్తితో పొడిచి స.హ. కార్యకర్త దారుణ హత్య

అతనిపై అమానుషంగా కత్తితో దాడి చేశారు. వారు వెంటనే వచ్చిన వాహనంపై పారిపోయారు. కత్తితో పొడవడంతో అతను కుర్చీ నుండి అలాగే కింద పడిపోయాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సహ చట్టం కార్యకర్త సూర్యనారాయణగా గుర్తించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయ సమీపంలో ఈ హత్య జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా సూర్యనారాయణపై పలు ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం కింద అధికారుల నుండి సమాచారాన్ని సేకరించి వారిని బ్లాక్ మెయిల్ చేసే వాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతనిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఐదు కేసులు కూడా నమోదయినట్లుగా తెలుస్తోంది. ఇతను జాతీయ శాంతి సలహా మండలి అధ్యక్షుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే కాకుండా ఇటీవల ఆయన అధికారులపై సహ చట్టం పిటిషన్లు అనేకం వేసినట్లుగా తెలుస్తోంది. వీటిలో ఏదో ఒకటి ఆయన హత్యకు కారణం కావొచ్చునని అనుమానిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో చెరువులో పూడిక పనులు చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని బత్తలపల్లి మండలం పొట్లమర్రి గ్రామంలో జరిగింది. ఉపాధి పనులలో భాగంగా అధికారులు చెరువు పూడిక పనులు చేయిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications