పూరి రథయాత్ర తొక్కిసలాటలో విశాఖ మహిళ మృతి

మరణించిన ఇద్దరు భక్తుల్లో ఒకర్ని విశాఖపట్నానికి చెందిన రవణమ్మ (30)గా గుర్తించారు. మరో వ్యక్తి పురుషుడు. అతను ఎవరనేది గుర్తించాల్సి ఉంది. ఇద్దరి మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. రథయాత్ర గుంపులో ఆ మహిళ ఉందా, లేదా అనేది తెలియాల్సి ఉందని పూరి జిల్లా కలెక్టర్ అర్వింద్ అగర్వాల్ అన్నారు. అసలు తొక్కిసలాట జరిగిందా, లేదా అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.
వాతావరణం చల్లగానే ఉన్నప్పటికీ పలువురు యాత్రికులు స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యారు. తల తిప్పుతోందనే కారణంతో చాలా మంది ఆస్పత్రిలో చేరారు. చికిత్స చేసి వారిని డిశ్చార్జి చేశారు. తొమ్మిది రోజుల మహోత్సవంలో పోలీసులు యాత్రికులను నియంత్రించడంలో విఫలమయ్యారనే విషయాన్ని ఇద్దరు భక్తుల మృతి అద్దం పడుతోందని అంటున్నారు.
గుంపులను అదుపు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో 2008, 2010, 2011ల్లో కూడా తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications