హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అత్యాశకు పోవద్దు: రంగంలో భవిష్యవాణి హితవు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rangam
హైదరాబాద్: ఎవరూ ఎలాంటి అత్యాశలకు పోవద్దని భవిష్యవాణి సోమవారం వినిపించింది. సికింద్రాబాద్ బోనాల జాతర ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఉదయం రంగంను నిర్వహించారు. ఇందులో స్వర్ణలత అనే యువతి భవిష్యవాణిని వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈసారి నిర్వహించిన పూజా కార్యక్రమాలు, ఆలయ సిబ్బంది చేసిన ఏర్పాట్లు తనకు అసంతృప్తిని కలిగించాయని చెప్పారు.

పూజలు సరిగా చేయడం లేదన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో కోరినన్ని వర్షాలు తప్పకుండా కురుస్తాయని చెప్పారు. ధరలు పెరుగుతాయన్నారు. మహాకాళేశ్వర స్వామిని ప్రతిష్టించాలని గతంలోనే తాను కోరానని, కానీ ఇప్పటి వరకు అది నెరవేర్చలేదని, ఆ పనిని తానే పూర్తి చేసుకుంటానని చెప్పారు.

కుల, మతాలకు అతీతంగా అందరూ తనకు సమానమే అని చెప్పారు. కుల, మతాలు కేవలం మనుషులు సృష్టించుకున్నవన్నారు. ప్రజలు అందర్నీ సంతోషంగా ఉంచుతానని, ప్రజల కోరికలు తీరుస్తానని చెప్పారు. పెద్ద పూజారి ప్రశ్నలు అడుగుతుండగా భవిష్యవాణి వాటికి సమాధానం చెప్పారు. రంగం కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, సనత్ నగర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.

కాగా ఆదివారం ఉదయం ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ, మర్రి శశిధర్ రెడ్డి, ఎంపి అంజన్ కుమార్ యాదవ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Bhavishyavani gave suggestions to the people in 
 
 Rangam in the part of Ujjain Mahankali Bonalu 
 
 festival on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X