మంత్రులకు సిఎం కిరణ్ రెడ్డి క్లీన్‌చిట్: జగన్‌కు సవాల్

న్యాయసాయం కావాలని కోరుతూ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాసిన లేఖ తనకు అందలేదని ఆయన అన్నారు. తెలంగాణపై త్వరగా తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అంశం మన రాష్ట్రానికి చెందిన వ్యవహారం మాత్రమే కాదని, దాని ప్రభావం దేశంలోని ఇతర రాష్టాలపై కూడా పడుతుందని ఆయన అన్నారు.
గ్యాస్ కొరత వల్లనే రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. గ్యాస్ కొరతను నివారించడానికి రెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే, వాటి ఫలితాలు వచ్చేందుకు సమయం పడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత మార్పులు ఉంటాయని అనుకుంటున్నవారికి నిరాశే ఎదురవుతుందని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 26 వివాదాస్పద జీవోలు జారీ చేసిన ఆరుగురు మంత్రులను విచారించాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరు అయిదుగురికి ప్రభుత్వం న్యాయసాయం అందించాలని నిర్ణయించింది. నోటీసులు అందుకున్న మోపిదేవి వెంకటరమణ వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయి జైలులో ఉన్నారు. తనను అరెస్టు చేసిన తర్వాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనకు మాత్రం ప్రభుత్వం న్యాయ సాయం అందించడం లేదు.












Click it and Unblock the Notifications