జగన్‌పై ప్రభుత్వం మనసు మార్చుకుంది: వినోద్

తెలంగాణ పునర్నిర్మాణం కోసం బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే తెలంగాణ వస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జాతీయ స్థాయిలో సానుకూల వాతావరణం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చే వరకు తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు.
వైయస్ జగన్ కేసులో విచారణను ఎదుర్కునే మంత్రులకు ప్రభుత్వం న్యాయ సహాయం అందించడంలో ఆంతర్యం ఏమిటో తెలపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికలపై త్వరలో తమ పార్టీ నిర్ణయం ప్రకటిస్తుందని ఆయన చెప్పారు.
తెలంగాణ వస్తోందని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాటలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తప్పు పట్టారు. తెలంగాణ వస్తుందని, ఉద్యమం అవసరం లేదని కెసిఆర్ అనడం సరైంది కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటేయడానికే కెసిఆర్ ఆ వాదనను ముందుకు తెస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేయకపోతే అంత మంది విద్యార్థులను ఎందుకు బలి తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications