వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌహతి యువతిపై దుశ్సాసన పర్వం: మరో ఇద్దరి అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guwahati molestation case: Two more held
హవటి: ఓ అమ్మాయిని యువకులు వివిధ రకాలుగా వేధించిన కేసులో అస్సాం పోలీసులు ఆదివారం మరో ఇధ్దరిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. జూలై 9న జరిగిన ఘటనలో మరో ఇద్దరు యువకులను తాము అరెస్టు చేశామన్నారు. దిగంత బసుమతరి, నవజ్యోతి డేకాలను ఆదివారం అదుపులోకి తీసుకున్నామని, మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

వీడియో ఫుటేజ్ సమర్పించిన వారిపై కూడా తాము దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. వీడియో తీసిన జర్నలిస్టులు అమ్మాయిపై ఘాతుకానికి ప్రోత్సహించినట్లు ఆధారాలు ఉంటే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గువాహటి ఘటనపై అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ శనివారం తీవ్రంగా స్పందించారు. 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు.

కాగా గుహవటిలో గత సోమవారం ఇరవై మంది యువకులు ఓ అమ్మాయి శరీరాన్ని తడముతూ ఆమెను వేధించారు. హృదయ విదారకంగా ఆమె రోదించి తనను వదిలేయమని వేడుకున్నా ఆ యువకులు తగ్గలేదు. ఆమెను వివస్త్రను చేసి అత్యాచారం చేసే ప్రయత్నా చేశారు. ఆ అమ్మాయిని అణువణువునా తడుముతూ వేధిస్తున్న సమయంలో పలువురు అక్కడే ఉన్నప్పటికీ ఆ ఘోరాన్ని ఆపలేకపోయారు. దీనిపై దేశ వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నాయకులు, మీడియా తీవ్రంగా ఖండించాయి.

సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినా.. ఐదు రోజులు గడిచినా ఇప్పటి వరకు పోలీసులు నిందితులందరినీ పట్టుకోలేదు. ఓ చానల్ తీసిన వీడియో ఫుటేజి ఆధారంగా 20 మందిలో 13 మందిని గుర్తించారు. వారిలో కేవలం నలుగురినే అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే గొగోయ్ పోలీసులపై మండిపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించారు. దీంతో, ఆ 13 మందితో కూడిన పోస్టర్లను గువాహటి అంతటా అంటించారు.

వారు ఎక్కడ కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే, ఈ ఘటనపై దర్యాప్తునకు జాతీయ మహిళా కమిషన్ కూడా ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు శనివారం ఆ బాలిక ఇంటికి వెళ్లి పరిశీలించారు. బాలిక వంటిపై సిగరెటు వాతలు ఉన్నాయని చెప్పారు. ఆ యువకులు పశువుల్లా ప్రవర్తించారన్నారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా హోం మంత్రి చిదంబరం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి ఘటనల విషయంలో మీడియా జాగరూకతతో స్పందించాలని కేంద్ర మంత్రి అంబికా సోనీ హితవు పలికారు. ఇటువంటి ఘటనలపై ప్రజలను అప్రమత్తం చేయాలని, బాధితుల మనసులను గాయపరచరాదని చెప్పారు.

English summary
Police have arrested two more suspected culprits from the group that publicly molested and stripped a teenage girl here last Monday, even as investigations are on to probe charges by an activist that a television journalist had instigated the crowd to go after the victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X