నాని వెళ్లినా టిడిపితోనే!: బయటకొచ్చిన వల్లభనేని వంశీ

టిడిపిని వీడాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదన్నారు. గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైనంపై పార్టీ అధినేతకు ఎప్పుడో వివరణ ఇచ్చానని తెలిపారు. నాని జగన్ పార్టీలోకి వెళ్లడం బాధాకరమన్నారు. నానిపై చర్యలు అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. తాను ఎప్పుడు టిడిపిలోనే ఉంటానని చెప్పారు. కాగా వంశీకి అత్యంత సన్నిహితుడైన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని ఇటీవల జగన్‌కు జై కొట్టిన విషయం తెలిసిందే.
నాని జగన్ వైపు మొగ్గినప్పటి నుండి వంశీ ఎవరికీ అందుబాటులో లేరనే ప్రచారం జరిగింది. సెల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశారన్నారు. దీంతో అతను కూడా జగన్ వైపు వెళ్లేందుకే అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా కొడాలి నాని పార్టీకి గుడ్ బై చెప్పినప్పుడు కృష్ణా జిల్లా నేతలు ఒకే వేదిక పైకి వచ్చి ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. కానీ ఆ వేదికపై వంశీ మాత్రం కనిపించలేదు.
అప్పుడే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పార్టీ సమావేశాలలో పాల్గొన్న వంశీ ఆ తర్వాత నుండి అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం జరగడంతో ఆయన కొడాలి నాని దారిలోనే నడుస్తారనే అనుమానాలు మరింత బలపడ్డాయి. నాని అంశం తర్వాత వంశీ ఇప్పటి వరకు బయటకు వచ్చి పెదవి విప్పలేదు. సోమవారం తొలిసారి వచ్చి తాను టిడిపిలోనే ఉంటానని ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications