దిగొచ్చిన మమతా బెనర్జీ: ప్రణబ్‌కే ఓటు, అసంతృప్తితోనే

రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొంటామని ఆమె చెప్పారు. ఈ రోజు జరిగిన సమావేశంలో పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. మాకు మరో అవకాశం లేకుండా పోయిందని, తాము వ్యక్తిగతంగా ప్రణబ్‌కు ఓటేయనున్నామని, తమది రాజకీయ నిర్ణయమని చెప్పారు. తాను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి తమ నిర్ణయాన్ని ఇప్పటికే వెల్లడించామని చెప్పారు. మమతా బెనర్జీ అంతకుముందు కొందరు ముఖ్యమైన శానససభ్యులు, పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు.
కాగా మమతా బెనర్జీ మొదటి నుండి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి విముఖత చూపిన విషయం తెలిసిందే. యుపిఏ ప్రణబ్‌ను ఎంపిక చేస్తుందని తెలియగానే ఆమె మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరుల పేర్లు తెర పైకి తీసుకు వచ్చింది. తాము సూచించిన వారిలో ఎవరినో ఒకరిని రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దింపాలని సోనియా గాంధీకి సూచించింది. అయితే మమత సూచనలను సోనియా బేఖాతరు చేశారు.
ఆమె వ్యతిరేకించిన ప్రణబ్‌నే ఎంపిక చేశారు. దీంతో ఆమె కొంతకాలంగా యుపిఏపై అసంతృప్తితో ఉన్నారు. ఓ సమయంలో యుపిఏ నుండి వైదొలుగుతారనే ప్రచారం కూడా జరిగింది. ఇటీవల కొద్ది రోజులుగా స్తబ్ధుగా ఉన్నారు. ఎన్నికలలో ప్రణబ్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో రాష్ట్రానికి చెందిన నేతకు మద్దతు ఇవ్వకుంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనతో ఆమె అసంతృప్తితోనైనా దాదాకే మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications