కన్నతల్లే ఆ ఇద్దరు చిన్నారులను కాటేసింది

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కన్నతల్లిపైనే అనుమానం వ్యక్తపరిచారు. చిన్నారులపై ఉన్న వేలిముద్రల ఆధారంగా చిన్నారులను హత్య చేసింది తల్లే అని పోలీసులు తేల్చిచెప్పారు. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను గుర్తుతెలియని వ్యక్తులు చున్నీతో గొంతులకు ఉరి వేసి చంపారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తుకారాంగేట్ పోలీసుస్టేషన్ సమీపంలోని అడ్డగుట్ట బీ సెక్షన్‌లో ఉంటున్న యాకుబ్‌పాషా, సమ్రీనా దంపతులకు సమ్రీన్ (4) మహేక్ (2) సంతానం. యాకుబ్‌పాషా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేస్తుంటాడు. మంగళవారం ఉదయం ఇతడు పనికి వెళ్లిపోయాడు.
మంగళవారం మధ్నాహ్నం 3.30 సమయంలో సమ్రీనా ఇద్దరు కూతుళ్లను ఇంట్లో పడుకోబెట్టి పక్కింట్లో ఉంటున్న బంధువుల వద్దకు వెళ్లిందని,సాయంత్రం 6.30 సమయంలో ఆమె ఇంటికి వచ్చిందనిస తలుపు తీసి ఉండడంతో అనుమానమొచ్చి లోపలికి వెళ్లిందని, కూతుళ్లు నేల మీద పడి ఉండడం, వారి గొంతుపై ఉరి బిగించిన ఆనవాళ్లు కనిపించడంతో ఆందోళన చెందిందని, వెంటనే సమీపంలో ఉన్న రెండు, మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లిందని, అక్కడి వైద్యులు పట్టించుకోకపోవడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లిందని, అప్పటికే పిల్లలు మృతిచెందారని అక్కడి వైద్యులు ద్రువీకరించారని వార్తలు వచ్చాయి.
ఇంట్లోని 9 తులాల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని యాకుబ్‌పాషా తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో దొంగతనం కోసమే పిల్లలను దుండగులు చంపి ఉంటారని అనుమానించారు. అయితే, తల్లే వారిద్దరిని కుటుంబ కలహాల కారణంగా మట్టుబెట్టిందని తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications