గాలి డీల్: మరొకరి అరెస్టు, ఇద్దరిపై లుకవుట్ నోటీసులు

ఇదిలా వుంటే, కర్ణాటక శానససభ్యులు గాలి సోమశేఖర రెడ్డిని, టిహెచ్ సురేష్ బాబును ఎసిబి అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది. దేశం విడిచి పారిపోకుండా వారి కోసం ఎసిబి లుకవుట్ నోటీసులు జారీ చేసింది. బళ్లారి (అర్బన్) శానససభ్యుడు సోమశేఖర రెడ్డిని, కాంప్లీ శాసనసభ్యుడు సురేష్ బాబును మాత్రమే ఈ కేసులో అరెస్టు చేయాల్సి ఉంది.
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో ఇప్పటి వరకు న్యాయవ్యవస్థకు చెందిన నలుగురిని ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరు కర్ణాటక శాసనసభ్యులు దేశం విడిచి వెళ్లకుండా అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుకవుట్ నోటీసులు పంపినట్లు ఎసిబి అధికారులు చెప్పారు.
విధానపరమైన అంశాల కారణంగానే ఇద్దరు శానససభ్యుల అరెస్టులో జాప్యం జరుగుతోందని అంటున్నారు. శాసనసభ్యులను, పైగా మరో రాష్ట్రానికి చెందిన శాసనసభ్యులను అరెస్టు చేసే విషయంలో కొన్ని నిబంధనలను పాటించాల్సి రావడంతో జాప్యం జరుతోందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications