సంగ్మా '69 ఆశలు గల్లంతు: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీయే

కడపడి వివరాలు అందే సమయానికి... ప్రణబ్ ముఖర్జీ ఓట్ల విలువ 5,70,970, సంగ్మా ఓట్ల విలువ 2,45,067గా ఉంది. కౌంటింగ్ కొనసాగుతోంది.
ప్రణబ్ ఆంధ్రప్రదేశ్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మేఘాలయ, బీహార్ తదితర రాష్ట్రాలలో మెజార్టీ సాధించారు. సంగ్మా ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్‌లలో మెజార్టీ సాధించారు. సంగ్మా ఈశాన్య రాష్ట్రానికి చెందిన నేత అయినప్పటికీ అక్కడ ప్రణబ్ కంటే బాగా వెనుకబడ్డారు. సొంత రాష్ట్రమైన మేఘాలయలోనూ దాదా కంటే 11 ఓట్లు తక్కువగా వచ్చాయి. కర్నాటకలో బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ ప్రణబ్ ముఖర్జీకి ఎక్కువగా ఓట్లు వచ్చాయి. దీంతో అక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా అర్థమవుతోంది. కన్నడలో ప్రణబ్ కంటే సంగ్మాకు 14 ఓట్లు తక్కువగా రాగా, మూడు ఓట్లు చెల్లలేదు. కేరళలో సంగ్మాకు ఒక్క ఓటు కూడా రాలేదు.
748 ఎంపీల ఓట్లలో ప్రణబ్ 527 పొందగా, సంగ్మా 206 దక్కించుకున్నారు. పోలైన ఎంపీల ఓట్లలో 15 చెల్లలేదు. అందులో ప్రణబ్‌వి 9 కాగా, సంగ్మావి 6. ఎంపీల ఓట్ల కౌంటిగ్ విషయానికి వస్తే దాదాకు 3,27,116 ఓట్లు, సంగ్మాకు 1,45,848 ఓట్లు వచ్చాయి. ప్రణబ్ ఓటింగ్ శాతం 70.5 కాగా, సంగ్మా ఓటింగ్ శాతం 27.5గా ఉంది. మొత్తం ఎంపీల ఓట్ల విలువ 5,49,408.
ఎమ్మెల్యేల ఓట్ల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 190 ఓట్లు పోలవగా 182 ప్రణబ్‌కు, 3 సంగ్మాకు పోలయ్యాయి. ఐదు ఓట్లు చెల్లుబాటు కాలేదు. బీహార్‌లో ప్రణబ్‌కు 146, సంగ్మాకు 90, చత్తీస్‌గఢ్‌లో ప్రణబ్‌కు 9, సంగ్మాకు 31, గోవాలో ప్రణబ్‌కు 39, సంగ్మాకు 50, అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రణబ్‌కు 54, సంగ్మాకు 2, జార్ఖండ్‌లో ప్రణబ్‌కు 60 సంగ్మాకు 20, జమ్ము కాశ్మీర్‌లో ప్రణబ్‌కు 68, సంగ్మాకు 15, కర్నాటకలో ప్రణబ్‌కు 117, సంగ్మాకు 103, అసోంలో ప్రణబ్‌కు 110, సంగ్మాకు 13, హర్యానాలో ప్రణబ్‌కు 53, సంగ్మాకు 29, గుజరాత్‌లో ప్రణబ్‌కు 59, సంగ్మాకు 123, హిమాచల్ ప్రదేశ్ ప్రణబ్‌కు 23, సంగ్మాకు 14, మేఘాలయలో ప్రణబ్‌కు 34, సంగ్మాకు 23 ఓట్లు పోలయ్యాయి.
ప్రణబ్ ముఖర్జీ గెలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెసు కార్యకర్తలు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. పార్లమెంటు హౌస్ ముందు పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి పదవిని అలంకరిస్తున్న తొలి బెంగాలీ నేత ప్రణబ్ ముఖర్జీయే కావడం గమనార్హం. ప్రణబ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తనను రాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు ప్రణబ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో ఆనందం మిన్నంటింది. ప్రణబ్‌కు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రణబ్‌కు ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని కేంద్రమంత్రి మునియప్ప అన్నారు. ప్రణబ్‌కు పార్టీల పరంగా కాకుండా సుదీర్ఘ అనుభవం దృష్ట్యానే ఓట్లు పడ్డాయని, ప్రణబ్ వ్యక్తిత్వానికే కర్నాటకలో ఓట్లు వేశారని అన్నారు. ప్రణబ్ గొప్ప అధ్యక్షుడిగా పేరు తెచ్చుకుంటారని కేంద్రమంత్రి చిదంబరం అన్నారు.












Click it and Unblock the Notifications