వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూసుకు పోతున్న ప్రణబ్, ఎపి నుండి 182-3

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం కొనసాగుతోంది. తొలుత పార్లమెంటు సభ్యుల ఓట్లను లెక్కించారు. అనంతరం శాసనసభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఎంపీల ఓట్లలో ప్రణబ్ ముఖర్జీ మరో అభ్యర్థి పిఏ సంగ్మా కంటే 321 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. ఎంపీల ఓట్లు మొత్తం 748 ఉండగా దాదా 527 ఓట్లు, సంగ్మా 206 ఓట్లు పొందారు. పోలైన ఓట్లలో 15 ఓట్లు చెల్లలేదు. అందులో 9 ప్రణబ్‌వి కాగా, 6 సంగ్మావి.

ఎంపీల ఓట్ల కౌంటిగ్ విషయానికి వస్తే దాదాకు 3,27,116 ఓట్లు, సంగ్మాకు 1,45,848 ఓట్లు వచ్చాయి. ప్రణబ్ ఓటింగ్ శాతం 70.5 కాగా, సంగ్మా ఓటింగ్ శాతం 27.5గా ఉంది. మొత్తం ఎంపీల ఓట్ల విలువ 5,49,408. మొత్తం ఓట్ల విలువ 10,98,882. ఇప్పటికే ఎంపీలతో భారీ ఓట్లు దక్కించుకున్న ప్రణబ్ ఎమ్మెల్యేల ఓట్లలో 1,76,426 ఓట్లు దక్కించుకున్నా గెలుస్తారు.

కానీ ఆయనకు భారీగా ఓట్లు వచ్చే అవకాశముంది. దాదాకు ఏడు లక్షలకు పైగా ఓట్ కౌంట్ వచ్చే అవకాశముంది. వార్త రాసే సమయానికి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఎపి నుండి ప్రణబ్ కు 182, సంగ్మాకు 3 ఓట్లు వచ్చాయి. 190 ఓట్లు పోలవగా 5 ఓట్లు చెల్లలేదు. మన రాష్ట్రం నుండి ప్రణబ్‌కు 36,936 ఓట్ల కౌంట్ రాగా, సంగ్మాకు 608 ఓట్ల కౌంట్ వచ్చింది. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో 59 ఓట్లు ఉండగా దాదాకు 54, సంగ్మాకు 2 ఓట్లు వచ్చాయి. మూడు చెల్లలేదు.

కాగా ప్రణబ్ గెలుపు లాంచనమే కావడంతో ఆయన నివాసం ఉన్న రహదారిలో కోలాహలం నెలకొంది. ఆయన ఇప్పుడున్న నివాసం వదిలి రాష్ట్రపతి భవనంకు మకాం మార్చనున్నారు. ప్రణబ్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు భారీగా కాంగ్రెసు నేతలు తరలి వస్తున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా రానున్నారని తెలుస్తోంది. ఆయన 25న పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రమాణ స్వీకారం చేస్తారు.

English summary
UPA nominee Pranab Mukherjee got the overwhelming support of Parliamentarians in the President's election securing a vote value of 3,73,116.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X