సొంత పార్టీపైనే పోరు: గాంధీభవన్ వద్ద విహెచ్ మౌనదీక్ష

కార్యకర్తల మనోగతాన్ని తెలుసుకోవడానికి కార్యకర్తలతో మేధోమథన సదస్సు నిర్వహిచాలని ఆయన నాలుగు నెలలుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తన మాటను పార్టీ నాయకులు పట్టించుకోకపోవడంతో ఆయన మౌనదీక్షకు దిగుతున్నారు. పార్టీలో సీనియర్లకు విలువ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. తన మాటలనే పట్టించుకోవడం లేదంటే కార్యకర్తలను ఎవరు పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఎఐసిసి కార్యదర్శిగా ఉన్న తనకే దిక్కు లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీని బలోపేతం చేయడానికి సిఫార్సు చేయడానికి వేసిన మంత్రుల కమిటీ తీరుపై ఆయన విమర్శలు చేశారు. మంత్రుల కమిటీ అసలు విషయమే మరిచిపోయిందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అవినీతిని మంత్రుల కమిటీ ప్రస్తావించలేదని, జగన్ అవినీతిని ప్రశ్నించకుండా పార్టీని బలోపేతం చేయలేమని ఆయన అన్నారు. వైయస్ జగన్ అవినీతిని మంత్రుల కమిటీ ఎందుకు పట్టించుకోలేదని ఆయన అడిగారు. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా ఏం చేసినా ఫలితం ఉండదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కార్యాయంలో ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటోను తీసేయాలని ఆయన కోరారు. పదవులు నిజమైన పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలని ఆయన అన్నారు. తమకు భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని ఆయన అన్నారు. అవినీతి మంత్రుల వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications