రైలు ప్రమాదంపై పార్లమెంటులో చర్చిస్తాం: విజయమ్మ

YS Vijayamma
నెల్లూరు: రైల్వే భద్రతను గాలికి వదిలేయడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం ఆరోపించారు. ప్రమాదానికి గురైన బోగీని ఆమె సోమవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రమాదంపై పార్లమెంటులో చర్చిస్తామని విజయమ్మ చెప్పారు. ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ఉగ్రవాద చర్యలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కోరారు.

భద్రత లోపించడంతోనే రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రైల్వేశాఖ మాజీ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రైలు ప్రమాద దుర్ఘటనపై లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో సమగ్ర విచారణను చేపట్టాలని ఆయన హైదరాబాదులో డిమాండ్ చేశారు. రైల్వేశాఖ నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యం కారణంగానే రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రైళ్లలో ఎలక్ట్రికల్, కేటరింగ్ తదితర పనులను ఔట్‌సోర్సింగ్ ఇవ్వడం వల్లే ప్రమాదాలు పెరిగిపోతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పేర్కొన్నారు. ప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతిప్రకటించారు. ప్రైవేటీకరణతో ప్రయాణికులకు రక్షణ కరువైందని చెప్పారు. ప్రభుత్వోద్యోగులతోనే ఈ పనులు చేయించాలన్నారు. రైలు ప్రమాద సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా వేర్వేరుగా పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+