వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూణేలో వరుస బాంబు పేలుళ్లు: ఒకరికి గాయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bomb
పూణే: మహారాష్ట్రలోని పూణేలో బుధవారం సాయంత్రం నాలుగు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. స్వల్ప తీవ్రత బాంబులు కావడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. బుధవారం సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో ఏడు నిమిషాల వ్యవధిలోనే పూణేలోని జెఎం రోడ్డులో ఈ పేలుళ్లు సంభవించాయి. జుంగ్లీ మహరాజ్ గంజ్ (జెఎం) రోడ్డులోని బాల గంధర్వ థియేటర్, దేనా బ్యాంక్, మెక్‌డొనాల్డ్ అవుట్ లెట్, పాపులర్ థియేటర్ సమీపాల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. ఐదో పేలుడు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఓ బాంబును నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. కిలోమీటర్ పరిధిలోనే ఈ పేలుళ్లు సంభవించాయి. ఐదో పేలుడు ఖైబర్ బార్ వద్ద జరిగినట్లు సమాచారం.

ఓ బాంబు చెత్తకుండీలోనూ, ఓ బాంబు సైకిల్ క్యారియర్‌లోనూ పేలాయి. డెటొనేటర్ సాయంతో వాటిని పేల్చినట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద నిరోధక బృందం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇది ఉగ్రవాదుల చర్య అవునా, కాదా అనే విషయం తెలియడం లేదు. పేలుళ్లతో పూణేలో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయి. ఇది ఉగ్రవాద చర్య కాదని పూణే పోలీసు కమిషనర్ గులాబ్ రావు పోల్ అన్నారు. అల్లరి మూకల పని అయి ఉంటుందని ఆయన అన్నారు. ఈ సంఘటనకు బాధ్యులమంటూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా చెప్పుకోలేదు.

కాగా, కొత్త కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం సాయంత్రం పూణేలోని బాల గంధర్వ థియేటర్‌కు రావాల్సి ఉండింది. అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దయింది. బాంబు స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుంది. పేలుళ్లు ఉగ్రవాద చర్య అని భావిస్తున్నారా అని అడిగితే ఈ సమయంలో వ్యాఖ్యానించడం సరి కాదని, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని మహారాష్ట్ర డిజిపి సంజీవ్ దయాళ్ అన్నారు.

పూణే బాంబు పేలుళ్లపై విచారణ జరుగుతుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. విషయం తెలిసిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సీనియర్ అధికారులతో సమావేశమై భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ఉగ్రవాద నిరోధక బలగాల సిబ్బంది మెక్‌డోనాల్డ్ అవుట్ లెట్ వద్ద సిసిటివీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు.

English summary
Four bomb blasts rocked Pune creating a panic situation in the area. The blasts reportedly took place near Dena Bank, Bal Gandharv theatre and a McDonalds outlet on the Jungli Maharaj Road. After less than an hour, a fourth blast took place Garware Chowk in the city. No casualties have been reported so far. All the blasts happened within a radius of 1km.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X