హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు సిఎం: తప్పులేదన్న గండ్ర, కెవిపి ఎందుకన్నారో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gandra Venkata Ramana Reddy
హైదరాబాద్: 2014లో రాజ్యసభ సభ్యుడి చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడన్న వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రభుత్వం చీప్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి గురువారం అన్నారు. ఆయన సిఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులు చిరంజీవి భవిష్యత్తు ముఖ్యమంత్రి అని చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు. అయితే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటే మాత్రం ఆ కుర్చీ ఇప్పుడు ఖాళీ లేదన్నారు.

రాజ్యసభ సభ్యుడు, తమ పార్టీ నేత కెవిపి రామచంద్ర రావు వ్యాఖ్యలపై పదే పద మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. కెవిపి ఇన్ని రోజుల తర్వాత వైయస్ ఫోటో విషయాన్ని ఎందుకు ప్రస్తావించారో అర్థం కావడం లేదన్నారు. వైయస్ ఫోటో పెట్టాలా లేదా తొలగించాలా అనేది అసలు అంశమే కాదన్నారు. ఆ దిశలో పార్టీలో ఎవరూ ఆలోచించడం లేదన్నారు. కెవిపి అనవసరంగా ఈ విషయాన్ని తెర పైకి తీసుకు వచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక రాయల సీమ అంటూ నినదిస్తున్న తెలుగుదేశం పార్టీ సీమ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యాఖ్యల వెనుక ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. లేదంటే బాబు బైరెడ్డి వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోవడానికి సహకరిస్తామని చెప్పిన బాబు ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారన్నారు.

తెలంగాణ వస్తుందనే తాను రాయలసీమ కోసం మాట్లాడుతున్నానని బైరెడ్డి అన్నారని, ఇవి ఆయన మాటలేనా లేక బాబు మాటనా వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రాజెక్టులు ఆయనకు ఇప్పుడు గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పోలవరం గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదన్నారు. బాబు తన హయాంలో రాష్ట్రంలో ఒక్క సాగు నీటి ప్రాజెక్టును కూడా చేపట్టలేదన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను చారు చౌకగా విక్రయించిన ఘనత బాబుదే అన్నారు.

English summary
Government chief whip Gandra Venkata Ramana Reddy said nothing wrong in ministers Ganta Srinivasa Rao and C.Ramachandraiah statements that Chiranjeevi is future Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X