రాజకీయ ప్రత్యామ్నాయం ఇస్తా: అన్నా హజారే

అన్నా టీమ్ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు దీక్ష విరమించనుంది. అన్నా హజారీ దీక్ష గురువారం ఐదో రోజుకు చేరుకుంది. దేశంలో మార్పునకు రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరమైతే దాన్ని పూరించాల్సిందేనని ఆయన అన్నారు. నిజమైన ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజల చేతుల్లో ఉండాలని ఆయన అన్నారు. ప్రజల డిమాండ్లను నెరవేర్చని నాయకులను అధికారం నుంచి దించేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పార్లమెంటుకు సరైన వ్యక్తులు ఎన్నిక కావడానికి రాజకీయ పార్టీ ఏర్పాటు మాత్రమే ప్రత్యామ్నాయం అయితే అందుకు సిద్ధపడడంలో తప్పు లేదని ఆయన అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న అన్నా హజారే చుట్టూ వేలాది మంది మద్దతుదారులు చేరారు. ఆయన కుడిచేయి మణికట్టు రాఖీలతో నిండిపోయింది. పార్టీని ఏర్పాటు చేయాలా అనే విషయంపై 48 గంటల్లో సమాచారం అందించాలని ఆయన తన అనుచరులకు సూచించారు.
దీక్ష విరమించి రాజకీయ ప్రత్యామ్నాయం ఇవ్వాలని జస్టిస్ సంతోష్ హెగ్డే, మాజీ ఆర్మీ చీఫ్ వికె సింగ్ తదితరులు గురువారం ఉదయం కోరారు. ఈ మేరకు వారు సందేశాలు పంపించారు. దీక్ష విరమించాలని అధ్యాత్మిక నేత శ్రీశ్రీ రవిశంకర్, నటుడు అనుపమ్ ఖేర్ కూడా అన్నాను కోరారు. ఈ మేరకు 20 మంది ప్రముఖులు అన్నాకు విజ్ఞప్తి చేశారు. ఇండియా అగెనెస్ట్ కరప్షన్ అధికారిక ట్విట్టర్ దేశంలో అన్నా రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఇవ్వాలా అనే ప్రశ్నను పోస్ట్ చేసి అవునో, కాదో చెప్పాలని కోరింది. అన్నా అసలు రంగు బయటపడిందని కాంగ్రెసు నేత అంబికా సోనీ విమర్శించారు.












Click it and Unblock the Notifications