• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టెక్కీ నీలిమ ఆఫీసుకు వెళ్లడమే పెద్ద మిస్టరీ

By Pratap
|

Neelima
హైదరాబాద్: మృత్యు ఒడిలోకి చేరిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీలిమ హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల ఇన్ఫోసిస్ కార్యాలయానికి ఎందుకు వెళ్దిందనేది ప్రశ్నార్థకంగా మారింది. మంగళవారం సాయంత్రం కార్యాలయానికి వెళ్లిన ఆమె తెల్లారేసరికి రక్తం మడుగులో శవమై తేలింది. మూడు వారాలు సెలవు పెట్టి నీలిమ అమెరికా నుంచి హైదరాబాదు వచ్చింది. అందువల్ల ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఆమెకు ఏమీ లేదు. జులై 22వ తేదీన హైదరాబాదు వచ్చిన ఆమె హైదరాబాదులోని ఆఫీసుకు అంత వరకు వెళ్లలేదు.

హైదరాబాదుకు వచ్చిన పది రోజుల తర్వాత ఇన్ఫోసిస్ కార్యాలయానికి వచ్చిన ఆమె పాత మిత్రులను ఎవరినీ కలుసుకోలేదని చెబుతున్నారు. ఆమె బ్లాక్ 18లోకి వెళ్లినట్లు సిసిటివీ కెమెరాల చిత్రాల ద్వారా తెలుస్తోంది. అక్కడ ఆమె చేస్తున్న ప్రాజెక్టుకు సంబంధించిన పని కూడా ఏమీ లేదని చెబుతున్నారు. నిజానికి, హైదరాబాదులో నీలిమ చేసిన ప్రాజెక్టుకు సంబంధించిన పని ఏదీ లేదు. ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్నవారు అమెరికాకు, పూణేకు చెందినవారేనని తెలుస్తోంది.

ఆ రాత్రి ఆమె తన కారును కూడా తీసుకుని రాలేదని చెబుతున్నారు. సిసిటివీ కెమెరా చిత్రాలను బట్టి చూస్తే ఆమె చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపించింది. హైదరాబాద్ ఇన్ఫోసిస్ కార్యాలయానికి ఆమె ఎందుకు వెళ్లిందనేది తెలిస్తే మృతి మిస్టరీ విడిపోతుందని అంటున్నారు. నీలిమ మంగళవారం రాత్రి 8.36 నిమిషాలకు తన వద్ద ఉన్న ఐడీ కార్డ్‌ను స్క్రాచ్ చేసి కంపెనీలోకి వెళ్ళిన ఆధారాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్టు డిసిపి యోగానంద్ శుక్రవారం తెలిపారు. 9.30 నిమిషాలకు కంపెనీలోని బిల్డింగ్ నెంబర్ 18, 19లోకి వెళ్లినట్టు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించామన్నారు. 10.29 నిమిషాలకు మల్టీలెవల్ పార్కింగ్ వద్ద పెద్ద శబ్దం వచ్చిందని, అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ పీఎస్.రమేష్ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించాడని చెప్పారు.

ఈ విషయాన్ని వెంటనే సెక్యూరిటీ అధికారి యాజమాన్యానికి తెలియజేశాడని, కంపెనీ అంబులెన్స్ సహాయంతో నీలిమను ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది రమేష్, సురేష్‌సింగ్, వెంకటేష్ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. రాత్రి 10.37 నిమిషాలకు ఈ విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు 11 గంటల సమయంలో సంఘటన స్థలానికి వెళ్లారని ఆయన తెలిపారు. నీలిమ బిల్డింగ్ నెంబర్ 18,19లో తిరిగినట్టు సీసీ కెమెరాల ఆధారంగా తెలిసిందన్నారు. ఆమె వెంట తెచ్చుకున్న హ్యాండ్‌బ్యాగ్ పదో అంతస్థులో పడి ఉన్నట్టు చెప్పారు. ఏడో అంతస్థులో ఆమె కాలి చెప్పును, తెల్లని పైపుపై మరకలను గుర్తించామని డీసీపీ తెలిపారు.

నీలిమ బ్యాగ్‌లోని ఫోన్ నెంబర్ స్లిప్‌ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ నెంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం అందించినట్టు ఆయన తెలిపారు. నీలిమ హత్యకు గురైందా..లేదా దూకి మరణించిదా అనే విషయాన్ని మీడియా ప్రతినిధులు అడగ్గా డీసీపీని అడగగా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిర్ధారణ అవుతుందని ఆయన చెప్పారు. కంపెనీలో ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను పరిశీలించి నీలిమ ఎటువైపు వెళ్లిందోనన్న డాటాను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు ఫొరెన్సిక్ నిపుణులు ఇచ్చే నివేదికను పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతం నీలిమది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
When B Neelima walked into Infosys campus in Gachibowli on Tuesday night only to be found in a pool of blood a couple of hours later, she left a trail of questions behind. While there were many clues found scattered in the IT major's parking lot, a twist in Neelima's mysterious death surfaced on Friday when it turned out that the techie was in India on a three-week leave and had no reason to be on campus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more