హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తలరాత బాగుండి కిరణ్ సిఎం: బొత్స, దామోదర అండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Damodara Rajanarasimha-Botsa Satyanarayana
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన తలరాత బాగుండి మంత్రి కాకుండానే నేరుగా ముఖ్యమంత్రి అయ్యారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం అన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకంలో పెరిగిన ఫీజుల భారంపై పునరాలోచిస్తామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాల నిర్ణయాలు తమకు గుదిబండగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెయిలైన విద్యార్థుల ఫీజులు చెల్లించాలా వద్దా అనే అంశంపై చర్చ జరగాల్సి ఉందన్నారు.

ఇంజనీరింగ్‌లో కనీసం ముప్పై ఐదు శాతం ఉత్తీర్ణత కూడా ఉండటం లేదన్నారు. రాష్ట్ర కాంగ్రెసులో కోవర్టులు ఎవరూ లేరన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్సు పైన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, చెప్పారు. రూ.లక్ష లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఫీజు చెల్లింపు వర్తిస్తుందన్నారు. గ్యాస్ సమస్య ఇప్పటికే పరిష్కారమైందని చెప్పారు. సోనియా గాంధీ పట్ల విధేయత, కాంగ్రెసు విధానాల పట్ల సుముఖంగా ఉన్న వారే కాంగ్రెసు కార్యకర్తలన్నారు.

మరోవైపు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంత్రులకు అండగా నిలిచారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లు బిసిల ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన మంత్రుల కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై దామోదర స్పందించారు. మంత్రుల ఆవేదన సరైనదే అన్నారు. ఫీజుల విషయమై కేబినట్ సబ్ కమిటీలో చర్చిస్తామన్నారు. సాంకేతిక విద్యకు ప్రతి ఏటా ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.

బిసి విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్సులో కోతలు సరికాదని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు న్యూఢిల్లీలో అన్నారు. ఓ వైపు తెలుగుదేశం పార్టీ బిసి డిక్లరేషన్ అంటూ ఉంటుంటే తమ ప్రభుత్వం మాత్రం ఇలా చేయడమేమిటని ప్రశ్నించారు.

English summary
Deputy chief minister Damodara Rajanarasimha has supported ministers Danam Nagendar and Mukesh Goud on their fee reimbursements comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X