జగన్, బాబు: మోహన్‌బాబు తేల్చుకోలేక పోతున్నారా?

పదిహేను రోజుల క్రితం మోహన్ బాబు అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను కలిశారు. అనంతరం ఆయన జైలు బయట మాట్లాడుతూ.. జగన్‌కు అనుకూలంగా మాట్లాడారు. తాను జైలులో తన మేనల్లుడు జగన్‌ను కలిశానని, అతనిని చూసి తన గుండె బరువెక్కిందని, ఆ బాధ తట్టుకోలేక పోతున్నానని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని అన్నారు. జగన్‌కు త్వరలో మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతున్నట్లుగా ఉందన్నారు. మహాభారతంలో శకుని ఒక్కడేనని, కానీ ఇప్పుడు మాత్రం ఢిల్లీలో ఎందరో శకునులు ఉన్నారని, ఎవరు ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తుందన్నారు. జగన్‌కు అంతా మంచే జరుగుతుందన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి ఆయన జగన్‌కు జై కొట్టినట్లేనని భావించారు. కానీ ఈ విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు, అలా అని ఖండించనూ లేదు.
అంతకుముందు మోహన్ బాబు ఇంటికి జగన్ రావడం కూడా చర్చనీయాంసమైంది. అయితే తెలుగుదేశం పార్టీతో, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బావమరిది బాలకృష్ణతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో మోహన్ బాబు టిడిపిలో చేరే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమని తాజాగా వినిపిస్తోంది. అంతేకాకుండా ఆయన తొలి నుండి టిడిపిలోనే ఉన్నారు. బాబుతో విభేదాల కారణంగా కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు.
కొంతకాలం క్రితం మోహన్ బాబు తన విద్యాసంస్థల వార్షికోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. ఆ తర్వాత పలుమార్లు పొగడ్తలతో ముంచెత్తారు. ఆ తర్వాత రెండుమూడుసార్లు కూడా బాబు గురించి పాజిటివ్‌గానే మాట్లాడారు. ఓసారి తాను అవినితికి దూరంగా ఉన్న పార్టీలో చేరతానని ప్రకటించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కోవడంతో ఆ ఉద్దేశ్యంతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని కాబట్టి ఆయన ఇతర పార్టీలో చేరే అవకాశముంటుందని, అదీ టిడిపియే అవుతుందనే వ్యాఖ్యలు వినిపించాయి.
కానీ ఆ తర్వాత జగన్‌తోనూ మోహన్ బాబు దగ్గరగా కనిపించారు. అయితే ఏ పార్టీలో చేరేది మాత్రం స్పష్టంగా తెలియజేయలేదు. దీంతో మోహన్ బాబు ఏ పార్టీలో చేరే విషయమై ఎటూ తేల్చుకోలేక కూడలిలో నిలుచుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications