జగన్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణపై కేసు నమోదు

ఈ నెల 13వ తేదిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఫీజు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె ఈ దీక్ష కోసం వెళ్తూ హనుమాన్ జంక్షన్ వద్ద కొద్దిసేపు ఆగారు. అప్పుడు ఆమెను కలిసేందుకు వంగవీటి రాధా మరో పార్టీ నేత దుట్టా రామచంద్ర రావు ఇంటికి వచ్చారు.
ఆ సమయంలో రాధ తన పూర్వ అనుచరుడు కొమళ్ల రవి కుమార్‌ను కులం పేరుతో దూషించినట్లుగా హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్‌లో గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. వంగవీటి రాధాతో పాటు మరో నలుగురి పైన కూడా ఈ కేసు నమోదైంది. వంగవీటి రాధాకృష్ణ తొలి నుండి కాంగ్రెసులో ఉన్నారు.
ఆ తర్వాత 2008లో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెసులో విలీనం చేయడంతో రాధా వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అప్పటి నుండి జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications