బొగ్గు స్కాం: పూర్తి బాధ్యత నాదే కానీ.. ప్రధాని వివరణ

బొగ్గు కేటాయింపులకు పూర్తి బాధ్యత తనదేనని, అయితే ఇందులో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకోలేదని ప్రధాని వివరణ ఇచ్చారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకే రాయితీలు ఇచ్చినట్లు చెప్పారు. కాగ్ నివేదిక అవాస్తవమన్నారు. ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు కేటాయింపుల విషయమై 1993 నుండి విధానాలు మారలేదన్నారు. గత ప్రభుత్వాల విధానాలనే తామూ కొనసాగించామని చెప్పారు.
లోకసభలో ప్రధాని ప్రకటన చేస్తుండగా విపక్షాలు అడ్డుకోవడమే కాకుండా స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వచ్చారు. దీంతో స్పీకర్ తప్పని పరిస్థితులలో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలోనూ కోల్ గేట్ దుమారం చెలరేగింది. సభ ప్రారంభమైన నిమిషాలలోనే చైర్మన్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ మరోసారి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications