జగన్ రిమాండ్ పొడిగింపు: సిబిఐ తీరుపై కోర్టు ఆగ్రహం

ఓఎంసి కేసులో నిందితులు గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, ఎమ్మార్ కేసు నిందితులు సునీల్ రెడ్డి, బిపి ఆచార్య, విజయరాఘవలకు కూడా కోర్టు రిమాండును పొడిగించింది. వీరందరినీ సిబిఐ కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ రోజు విచారించింది. కాగా సిబిఐ అధికారుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిందితులకు ఛార్జీషీట్లు అందించడంలో సిబిఐ అధికారులు జాప్యం చేస్తున్నారని డిఫెన్స్ న్యాయవాదులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో సిబిఐ పని తీరుపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఛార్జీషీట్లు అందించే విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. ఈ విషయమై అధికారులు బుధవారం కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
మరోవైపు గాలి బెయిల్ డీల్ కేసులో పట్టాభి రామా రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది.












Click it and Unblock the Notifications