రేప్ చేస్తే ధర్నాలొద్దన్న మంత్రి, మహిళల దేహశుద్ది

ఆదివారం 4వ రాష్ట్రస్థాయి అన్నాబావ్ సాతే సాహిత్య సమ్మేళన్ ముగింపులో మంత్రి మాట్లాడారు. మహిళలపై వేధింపులు నే అంశంపై ఆయన ప్రసంగిస్తూ.. అత్యాచార బాధితుల కోసం ధర్నాలు, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి తాను పూర్తిగా వ్యతిరేకమని, అలా చేస్తే కేసు తీవ్రత తగ్గిపోయే ప్రమాదముందని, బాధితుల పక్షాన ర్యాలీలు, ధర్నాలు అవసరం లేదని అన్నారు.
అంతేకాకుండా గర్భం దాల్చిన మహిళలు చిన్నారులకు జన్మనిచ్చి వారి భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయన ప్రసంగం ముగించుకొని వెళ్లిపోయేందుకు సిద్ధమైన సమయంలో అతివలు అతనికి దేహశుద్ధి చేశారు. ఆయన తప్పించుకొని పోయి కారెక్కి ఉడాయించారట. అయితే దీనిపై ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు అందలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications