వీళ్లు మగాళ్లా: కాంగ్రెసు నేతలపై నారాయణ వ్యాఖ్య

Narayana
హైదరాబాద్: తెలంగాణ కోసం 'ప్రజాపోరు' యాత్ర నిర్వహిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మంత్రులపై, అధికార పార్టీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలతో మండిపడ్డారు. బుధవారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ, హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోనూ ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పిచ్చాసుపత్రుల్లో ఉండాల్సిన వారంతా కేబినెట్‌లో ఉండడం వల్లనే రాష్ట్ర పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఈ ప్రాంత కాంగ్రెస్ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చేతగాని దద్దమ్మలై సోనియాను చూసి దాక్కుంటున్నారని మండిపడ్డారు. 'జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర' అంటున్న కాంగ్రెస్ నేతలందరూ గాంధీభవన్‌లో ఒకేచోట ఉంటూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. డిసెంబర్ 9 ప్రకటనపై మాట తప్పిన కాంగ్రెస్ నేతలను పట్టపగలు నడివీధిలో ఊరేగించి ఉరివేయాలన్నారు.

వీరంతా మోసకారులని, ముక్కునేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో కప్పల్లా అరుస్తూ ఢిల్లీలో మాత్రం పిల్లుల్లా మూలుగుతారని విమర్శించారు. రొయ్యకులాగే వీరికీ మీసాలున్నాయి తప్ప రోషం మాత్రం లేదని దెప్పిపొడిచారు. "పార్లమెంటులో సోనియాను చూసి, తలలు బెంచీల కింద పెట్టుకునే మీరు మగాళ్లా?'' అని ఎద్దేవా చేశారు. అవసరమనుకుంటే కాంగ్రెస్ పార్టీ దేవుడిని కూడా అమ్ముకుంటుందని అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తుంటే మంత్రుల లూటీకి ప్రభుత్వం వంతపాడుతోందని విమర్శించారు. విద్యుత్తు సమస్యను పరిష్కరించకపోతే ప్రజలు గుండు కొట్టించి ఊరేగిస్తారని హెచ్చరించారు. నాన్చుడు ధోరణి విడనాడి తెలంగాణపై కలసిరావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు హితవుపలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+