హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
కర్నూలు/హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని... వాటిపై విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయస్ మూడో వర్ధంతి సందర్భంగా ఆదివారం కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు సమీపంలోని స్మృతివనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ఉప ఎన్నికల ప్రచార సమయంలో వైయస్ సతీమణి తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కూడా ప్రభుత్వాన్ని ఇదే కోరారని ఆయన గుర్తు చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను చూసి, తట్టుకోలేని ప్రభుత్వం... సిబిఐని అడ్డం పెట్టుకొని అన్యాయంగా జైలులో పెట్టిందని ఆరోపించారు. కనీసం తండ్రి వర్ధంతి వేడుకలకు హాజరు కాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే మహానేత పథకాలు తిరిగి అమలవుతాయన్నారు. వైయస్ గురించి చెబుతూ.. వైవి సుబ్బా రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

మరోవైపు వైయస్ మరణించాక సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం యు టర్న్ తీసుకుందని పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, సోమయాజులు ఆరోపించారు. జగన్‌ను ఎదుర్కోవడానికి కుట్రలు పన్నుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. వైయస్ మృతిపై ఇప్పటికీ అనుమానాలున్నాయని, వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో పరిస్థితి జగన్‌కు అనుకూలంగా ఉందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు.

విద్యుత్ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడే తీరు చూస్తుంటే సిగ్గేస్తోందన్నారు. ఇప్పుడున్న కాంగ్రెసు ప్రభుత్వం వైయస్ విధానాలను పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ దారిలో వెళుతోందన్నారు. రూ.30 కోట్లు ఇచ్చి సర్వే చేయించుకున్నారన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు వ్యాఖ్యలను వారు ఖండించారు. హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర ఉన్నదా లేదా అన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలిందన్నారు.

English summary
YV Subba Reddy was suspected on late YS Rajasekhar Reddy's helicopter accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X