కెసిఆర్ మోసం, మూణ్ణెళ్లలో తెలంగాణ: సుష్మస్వరాజ్

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మూణ్ణెళ్లలో తెలంగాణపై ప్రకటన చేస్తామని ఆమె చెప్పారు. యుపిఏ ప్రభుత్వం పోతే గానీ తెలంగాణ రాదన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెసును నమ్మితే నట్టేట్లో మునిగినట్లేనని కెసిఆర్‌కు హితవు పలికారు. ఈ విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిదన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వదని, దీనిని బిజెపి నేతలు కెసిఆర్‌కు చెప్పాలన్నారు.
కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెసు వల్ల తెలంగాణ సాధ్యం కాదన్నారు. తెలంగాణపై గత ఎన్నికలలో కాంగ్రెసు ఇచ్చిన మాటను బుట్టదాఖలు చేయడం దారుణమన్నారు. యుపిఏ పూర్తి కాలం కొనసాగే అవకాశాలు లేవని, మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారని, ప్రజల ఆకాంక్షను కేంద్రం గౌరవించాలని సూచించారు.












Click it and Unblock the Notifications