జగన్ పార్టీలో చేరు: కెవిపిపై విహెచ్, ఆమోస్ నిప్పులు

కెవిపి వైయస్ పాదయాత్ర పుస్తక ఆవిష్కరణకు మంత్రులు ఎలా హాజరవుతారని ఆయన ప్రశ్నించారు. కొంతమంది రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని కెవిపిని ఉద్దేశించి అన్నారు. పార్టీలో కొందరు అవకాశవాదులుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సేవ్ కాంగ్రెస్ పేరుతో శనివారం ఢిల్లాలో ఓ సదస్సును ఏర్పాటు చేస్తున్నానని, దీనికి రాష్ట్ర కాంగ్రెసు నేతలు అందరూ రావాలని, ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా సమవేశం ఆగదన్నారు.
పార్టీలో మేథోమథనం జరగాలని తాను ఎన్నో రోజుల నుండి చెప్తున్నానని విహెచ్ గుర్తు చేశారు. వైయస్ జగన్ తప్పు చేశారు కాబట్టే జైలుకు వెళ్లారని, జాతిపిత మహాత్మా గాంధీతో జగన్‌ను పోల్చడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు కాంగ్రెసు నేతలు ఎందుకు స్పందించలేదో చెప్పాలని విహెచ్ ప్రశ్నించారు.
దివంగత వైయస్ గురించి చెప్పాలనుకున్న వారు జగన్ పార్టీలో చేరితే మంచిదని కెవిపిని ఉద్దేశించి మరో నేత ఆమోస్ అన్నారు. కాంగ్రెసులో ఉండి జగన్‌కు లబ్ధి చేకూర్చాలనుకుంటున్న వారు ఆయన పార్టీని కాంగ్రెసులో విలీనం చేపిస్తే మంచిదని సూచించారు. వైయస్ పాదయాత్ర ఘనత గురించి చెప్పాలనుకున్న నేతలు జగన్ పార్టీలో చేరితే మంచిదన్నారు. కెవిపి పుస్తకావిష్కరణకు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో సహా మంత్రులు వెళ్లడం సరికాదన్నారు.
కెవిపి కాంగ్రెసును భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెసు పార్టీ పట్ల కెవిపికి ప్రేమ ఉంటే జగన్ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయించాలన్నారు. మంత్రులు కెవిపి పుస్తకావిష్కరణకు వెళ్లారా లేక ముఖ్యమంత్రి మార్పు కోసం వెళ్లారా చెప్పాలని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిస్తే తెలంగాణ వస్తుందన్న నేతలు జగన్ గెలిచారు కాబట్టి సీమాంధ్ర ఓటర్లు తెలంగాణకు ఓకే అన్నట్లేనా అని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర నేతల ఒత్తిళ్లకు అధిష్టానం తలొగ్గి తెలంగాణపై నిర్ణయాన్ని ఆలస్యం చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications