వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కెసిఆర్‌తో చర్చలా!?: కిరణ్ స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్లనే'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi - K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తమ పార్టీ అధిష్టానం నేరుగా చర్చలు జరపడంపై మన రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు పార్టీ మాజీ మంత్రులు, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్లనే అధిష్టానం కెసిఆర్‌తో డైరెక్టుగా చర్చలు జరుపుతోందని వారు భావిస్తున్నారని తెలుస్తోంది.

తెలంగాణ అంశంపై కెసిఆర్‌తో చర్చలు జరపడం, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు అన్నింటికీ కిరణ్ రెడ్డియే కారణమని వారు భావిస్తున్నారని అంటున్నారు. కిరణ్ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని, అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని మంత్రులు, మాజీ మంత్రులు అభిప్రాయపడుతున్నారట. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరి కిరణ్ కరెక్టుగా ఉంటే కెసిఆర్‌తో అధిష్టానం చర్చలు జరిపే పరిస్థితి వచ్చి ఉండేది కాదని అంటున్నారు.

గురువారం మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన సమావేశాలు మొదటిసారి గంటసేపు, రెండోసారి అర్ధగంటపాటు వాయిదా పడింది. అసెంబ్లీ వాయిదా పడ్డ సమయంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన నేతలు ఆయనతో భేటీ అయ్యారు.

మాజీ మంత్రులు గాదె వెంకట రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, జానా రెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు ఉప ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిఎల్ మాట్లాడుతూ.. కిరణ్ కరెక్టుగా లేని.. మార్చితే ముఖ్యమంత్రిని మార్చాలని లేదా తనను మంత్రివర్గం నుండి తప్పించాలని అధిష్టానానికి లేఖ రాసినట్లు చెప్పారు.

English summary

 It is said that Congress party senior leaders like JC Diwakar Reddy, Jana Reddy are disappointed with High Command talks with TRS chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X