జగన్ తప్పు చేశాడని చెప్పిందే మేమే, చేర్చుకోం: ఆనం

కాంగ్రెసు పార్టీ సమైక్యవాదానికే కట్టుబడి ఉందన్నారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని చెప్పారు. తెలంగాణపై ఎలాంటి చర్చలు జరగటం లేదన్నారు. కానీ ఈ విషయంపై కేంద్రం సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
డీజిల్ ధరలు తగ్గించాలని తెరాస
సభ రేపటికి(శుక్రవారానికి) వాయిదా పడిన అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు శాసనమండలిలోని ముఖ్యమంత్రి చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. పెంచిన డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ఆందోళనపై స్పందించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారిని చాంబర్‌లోనికి పిలిపించుకొని మాట్లాడారు.
మరోవైపు శాసనసభ సమావేశాన్ని నిర్వహించకుండా వాయిదా వేయడం పట్ల తెలుగుదేశం, వామపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ వాయిదా వేయడాన్ని నిరసిస్తూ ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు రవీంధ్ర భారతి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా అసెంబ్లీ రెండో గేటు వద్ద ఆందోళన తెలిపింది.












Click it and Unblock the Notifications