1.86లక్షలకోట్ల నష్టం:ప్రధానిపై బిజెపి ఎమ్మెల్యే ఫిర్యాదు

ఎమ్మెల్యే నితిన్ రాత పూర్వకంగా పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న ప్రధాని తన నిర్ణయాల ద్వారా తన సన్నిహితులకు లబ్ధి చేకూరేలా బొగ్గు బ్లాకులను కేటాయించారని ఆరోపించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపును పరిశీలిస్తే ఈ కుంభకోణంలో ప్రధాని పాత్ర ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు.
కాగా బొగ్గు బ్లాకుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల పార్లమెంటు సమావేశాలు జరిగిన సమయంలో ప్రతిపక్షాలు ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది కూడా. మన్మోహన్ రాజీనామా కోరుతూ ప్రతిపక్ష బిజెపి వర్షాకాల సమావేశాలను స్తంభింప చేసింది. పార్లమెంటు సమావేశాలు 13 రోజులు జరిగాయి.
కానీ ఒక్క రోజు కూడా ఇటు లోకసభ గానీ, అటు రాజ్యసభ కానీ సజావుగా సాగలేదు. బొగ్గు స్కాం వ్యవహారంలో ప్రధాని రాజీనామా చేశాకే చర్చ పెట్టాలని బిజెపి డిమాండ్ చేయగా, ప్రధాని మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని కాంగ్రెసు కుండబద్దలు కొట్టడంతో సెషన్స్ ఎలాంటి ప్రజా సమస్యలపై చర్చ జరగకుండానే ముగిశాయి.












Click it and Unblock the Notifications